జీ సినిమాలు (నవంబర్ 27th)

Saturday,November 26,2016 - 08:00 by Z_CLU

eenadu

నటీ నటులు : కమల హాసన్, వెంకటేష్

ఇతర నటీనటులు : గణేష్ వెంకటరామన్, Dr.భారతీ రెడ్డి, సంతాన భారతి, శ్రీమాన్, ప్రేమ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శృతి హాసన్

డైరెక్షన్ : చక్రి తోలేటి

ప్రొడ్యూసర్ : కమల హాసన్

రిలీజ్ డేట్ : 19 సెప్టెంబర్ 2016

కమల్ హాసన్, వెంకటేష్ నటించిన నటించిన ఈనాడు సినిమా ఏ నటుడైనా చేసి తీరాలి అనుకున్న స్టోరీ, ప్రేక్షకులు చూసి తీరాలి అనుకునే సినిమా. సరికొత్త కథనంతో కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెరకెక్కిందే ఈనాడు. ఇందులో కమల హాసన్ యాక్టింగ్ హైలెట్.  ——————————————————————

tik-tik-tik

 

నటీ నటులు : కృష్ణ భగవాన్, వేణు మాధవ్ తదితరులు

——————————————————————

maisamma-ips

నటీ నటులు  : ముమైత్ ఖాన్, సాయాజీ షిండే

ఇతర నటీనటులు : రఘుబాబు, జీవా, బ్రహ్మానందం, M.S.నారాయణ, ప్రదీప్ రావత్

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ

డైరెక్టర్ : భరత్ పారెపల్లి

ప్రొడ్యూసర్ : దాసరి నారాయణ రావు

రిలీజ్ డేట్ : 2008

పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మైసమ్మను తన అక్క దుర్గ పెంచుతుంది. ఆ ఊళ్ళో రౌడీయిజం చలాయించే ఒక రౌడీ దుర్గను  పెళ్లి చేసుకుని వ్యభిచారం చేయిస్తున్నాడు. అన్నీ సహించిన దుర్గ, తన భర్త, మైసమ్మను బలాత్కారం చేస్తుంటే తట్టుకోలేక ఆ అమ్మాయిని తీసుకుని పారిపోతుంటుంది. అది చూసిన ఆ రౌడీ ఆ ఇద్దరి పైకి కుక్కలను ఉసి గొల్పుతాడు.ఎలాగోలా మైసమ్మను కాపాడుకున్న ఆమె ఆ కుక్కలా బారిన పడి చనిపోతుంది.  మైసమ్మ IPS గా ఎదిగి ఎలా పగ సాధిస్తుంది అన్నదే ప్రధాన కథాంశం.

——————————————————————

baanam

హీరోహీరోయిన్లు – నారా రోహిత్ ,వేదిక
నటీనటులు – రాజీవ్ కనకాల, సాయాజీ షిండే తదితరులు
సంగీతం – మణిశర్మ
దర్శకత్వం – చైతన్య దంతులూరి
విడుదల తేదీ – 2009

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘బాణం’. తొలి సినిమా అయినప్పటికీ కథానాయకుడిగా నారా రోహిత్ తన దైన నటనతో మంచి మార్కులు అందుకున్నాడు. 2009 లో విడుదలైన ఈ చిత్రం లో నారా రోహిత్ సరసన వేదిక కథానాయికగా నటించింది. సందేశం తో కూడిన ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో నారా రోహిత్- వేదిక జంట అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నారా రోహిత్ సీరియస్ యాక్టింగ్ తో పాటు మణి శర్మ అందించిన సంగీతం సినిమాకు హైలైట్. దర్శకుడి చైతన్య స్క్రీన్ ప్లే, మాటలు అందరినీ ఆకట్టుకొని పాత్ బ్రేకింగ్ హానెస్ట్ మూవీ గా నిలిచిపోయింది..

——————————————————————

dishyum-dishyum

నటీనటులు : జీవా, సంధ్య

ఇతర నటీనటులు:  గిన్నిస్ ఫక్రు, నాజర్, అనీ మాళవిక, SJ సూర్య, విశాల్

మ్యూజిక్ డైరెక్టర్ :  విజయ్ ఆంటోని

డైరెక్టర్ : శశి

ప్రొడ్యూసర్ : విశ్వనాథన్, రవిచంద్రన్

రిలీజ్ డేట్ : 2 ఫిబ్రవరి 2006

రెండు విభిన్న మనస్తత్వాలు ప్రేమలో పడితే ఎలా ఉంటుందో అతి సున్నితంగా చెప్పిన సినిమా డిష్యుం డిష్యుం. ఈ సినిమాలో జీవా స్టంట్ మాస్టర్ అయితే హీరోయిన్ గా నటించిన సంధ్య ఆర్ట్స్ స్టూడెంట్. వీరి ప్రేమ కథ ఎలా మొదలవుతుంది. ఎలాంటి మలుపులు తిరిగుతుందనేదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశ.

——————————————————————

ramudu_bheemudu

నటీ నటులు : N.T.రామారావు, జమున

ఇతర నటీనటులు : S.V. రంగారావు, గిరిజ, రేలంగి, రమణ రెడ్డి, సూర్య కాంతం, రాజనాల, L. విజయ లక్ష్మి

మ్యూజిక్ డైరెక్టర్ : పెండ్యాల నాగేశ్వర రావు

డైరెక్టర్ : తాపీ చాణక్య

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 21 మే 1964

 నందమూరి తారక రామారావు గారి కరియర్ లో ఆయన టచ్ చేయని జోనర్ లేదు. కామెడీ జోనర్ లో తెరకెక్కిన ‘రాముడు- భీముడు’ ఆల్ టైం హిట్. ఈ సినిమాని ఇప్పుడు చూసినా అంతే ఎంజాయ్ చేస్తారు ఆడియెన్స్. రొటీన్ లైఫ్ లో బోర్ అయిపోయి చూడటానికి ఒకేలా ఉండే రాముడు భీముడు ఒకరి స్థానంలో ఒకరు రావడంతో, మంచి కామెడీ జెనెరేట్ అవుతుంది. డ్యూయల్ రోల్ లో నటించిన NTR పర్ఫామెన్స్ హైలెట్.