జీ తెలుగు ప్రోమోతో ధైర్యం వచ్చింది

Tuesday,June 23,2020 - 01:57 by Z_CLU

తను మళ్లీ సినిమాల్లోకి వస్తానని ప్రకటించారు ఒకప్పటి హీరోయిన్ రేణుదేశాయ్. తను మరోసారి కెమెరా ముందుకొస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే భయంతోనే ఇన్నాళ్లూ ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంటున్నారు.

“నేను మళ్లీ మేకప్ వేసుకుంటే జనం చూస్తారా? కెమెరా ముందుకొస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఈ వయసులో ఎందుకు అని కామెంట్ చేస్తారేమో. ఇలాంటి భయాలతోనే ఇన్నాళ్లూ యాక్టింగ్ కు దూరమయ్యాను. అయితే జీ తెలుగులో చేసిన ప్రోమోతో నాకు నమ్మకం వచ్చింది. ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. ఇకపై సినిమాల్లో నటిస్తాను.”

ఇలా తన రీఎంట్రీపై ప్రకటన చేశారు రేణుదేశాయ్. మొన్నటివరకు కేవలం దర్శకత్వం గురించి మాత్రమే ఆలోచించానని, జీ తెలుగు ప్రోమోకు వచ్చిన రెస్పాన్స్ తో ఇకపై యాక్టింగ్ కెరీర్ గురించి కూడా ఆలోచిస్తానని ప్రకటించారు రేణుదేశాయ్.