తాజ్ మహల్ వద్ద స్టయిలిష్ స్టార్

Sunday,March 07,2021 - 10:07 by Z_CLU

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సడెన్ గా తాజ్ మహల్ వద్ద ప్రత్యక్షమయ్యాడు. పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడనుకున్న బన్నీ.. ఇలా సడెన్ గా ఆగ్రాతో ప్రత్యక్షమై అందరికీ షాక్ ఇచ్చాడు.

allu arjun taj mahal

ఇంతకీ బన్నీ తాజ్ మహల్ కు ఎందుకెళ్లాడో తెలుసా? నిన్న తన వెడ్డింగ్ యానివర్సిరీని, భార్య స్నేహారెడ్డితో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ప్రతి ఏటా ఇది జరిగిదే ఈసారి మాత్రం తాజ్ మహల్ కు వెళ్లడానికి కారణం ఏంటి?

allu arjun taj mahal

బన్నీ-స్నేహా పెళ్లి చేసుకొని నిన్నటికి సరిగ్గా దశాబ్దం అవుతోంది. అందుకే డికేడ్ సెలబ్రేషన్స్ కోసం ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ కు వెళ్లింది ఈ జంట.

allu arjun taj mahal

బ్యాక్ గ్రౌండ్ లో తెల్లటి తాజ్ మహల్. ముందు వైట్ డ్రెస్ లో హాట్ కపుల్. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేలా ఉన్నాయి ఈ ఫొటోలు. అందుకే రాత్రి నుంచి వైరల్ అవుతున్నాయి.

allu arjun taj mahal