సైరా అంటున్న బన్నీ

Monday,September 30,2019 - 04:06 by Z_CLU

టాలీవుడ్ అంతా సైరా మయమైంది. ఫ్యాన్ గ్రూప్స్, ఇతర సినిమాలతో సంబంధం లేకుండా అంతా సైరా గురించి మాట్లాడుతున్నారు. మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యాడు. తెలుగు సినిమాకు ఇదొక ప్రౌడ్ మూమెంట్ అంటున్నాడు బన్నీ.

“చాలా ఏళ్ల కిందట మగధీర చూసినప్పుడు, ఏదో ఒక రోజు ఇలాంటి గ్రాండ్ ఎపిక్ సినిమాలో చిరంజీవిని కూడా చూడాలని కోరుకున్నాను. ఆ కోరిక సైరాతో ఇలా నెరవేరబోతోంది. చిరంజీవి గారితో ఇలాంటి ఎపిక్ సినిమాను నిర్మించిన రామ్ చరణ్ కు కంగ్రాట్స్. ఓ తండ్రికి, కొడుకు ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ ఇదే.”

అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకాబోతున్న ఈ సినిమా టాలీవుడ్ లో చరిత్ర సృష్టించాలని కోరుతున్నాడు బన్నీ. సైరా సినిమా మేజిక్ క్రియేట్ చేయాలని, మనందరి హృదయాల్లో కలకాలం నిలిచిపోవాలని కోరుకున్నాడు.