సైరా ఆడియో రివ్యూ

Monday,September 30,2019 - 04:41 by Z_CLU

సరిగ్గా విడుదలకు కొన్ని గంటల ముందు సైరా జ్యూక్ బాక్స్ రిలీజ్ చేశారు. ఇంతకుముందే ఎనౌన్స్ చేసినట్టు జూక్ బాక్స్ లో కేవలం 4 సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. వీటిలో 2 స్ట్రయిట్ సాంగ్స్ కాగా, మిగతా 2 పాటలు మాంటేజ్ సాంగ్స్ గా సినిమాలో కనిపించబోతున్నాయి.

అయితే ఈ పాటలతో పాటు మరికొన్ని సాంగ్ బిట్స్ ను కూడా రిలీజ్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ జ్యూక్ బాక్స్ లో సాంగ్ బిట్స్ లేవు. కేవలం 4 పాటలు మాత్రమే ఉన్నాయి. అమిత్ త్రివేది కంపోజ్ చేసిన ఈ పాటలు వేటికనే భిన్నంగా, కొత్తగా ఉన్నాయి.

మొదటి సాంగ్ జాగో నరసింహా జాగోరే పాటను శంకర్ మహదేవన్, హరిచరణ్, అనురాగ్ కులకర్ణి కలిసి ఆలపించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాట ఫుల్ జోష్ తో సాగుతుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పొగుడుతూ, జాతర నేపథ్యంలో వచ్చే సాంగ్ ఇది. ఈ పాటల ో చిరంజీవి స్టెప్పులు ఉండే ఛాన్స్ ఉంది.

రెండో పాట అందం అంకితం అనే లిరిక్స్ తో సాగుతుంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను విజయ్ ప్రకాష్, సాషా తిరుపతి కలిసి పాడారు. మంచి బీట్ కు మెలొడీ టచ్ ఇస్తూ సాగే ఈ పాట, చిరంజీవి-నయనతార మధ్య ఉంటుందనే విషయం సాహిత్యం వింటే తెలుస్తుంది.

ఇక మూడో సాంగ్, టైటిల్ సాంగ్.. ఈ పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటికే సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తోంది ఈ సాంగ్. అంతేకాదు.. టోటల్ ఆల్బమ్ లో హైలెట్ సాంగ్ కూడా ఇదే. సీతారామశాస్త్రి రాసిన ఈ మోస్ట్ ఎనర్జిటిక్ సాంగ్ ను అంతే ఎనర్జిటిక్ గా సునిధి చౌహాన్, శ్రేయా ఘోషల్ ఆలపించారు.

నాలుగో పాట శ్వాసలోన దేశమే అనే లిరిక్స్ తో సాగుతుంది. దేశభక్తిని రేకెత్తించేలా, అప్పటి ప్రజల మనోభావాల్ని ఆవిష్కరించేలా అద్భుతమైన పదాలతో చంద్రబోస్ ఆ పాటను రాయగా.. హరిచరణ్ పాడాడు.