టాక్సీవాలా టీమ్ కు బన్నీ పార్టీ

Monday,November 19,2018 - 01:44 by Z_CLU

ఓ సినిమా సక్సెస్ అయితే అది కేవలం ఆ యూనిట్ కు మాత్రమే సంబరం కాదు. టోటల్ ఇండస్ట్రీకే పెద్ద పండగలాంటిది. అందుకే సక్సెస్ వస్తే అందరూ సంబరాలు చేసుకుంటారు. మొన్నటికిమొన్న మహానటి సక్సెస్ అయినప్పుడు టాలీవుడ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. ఇప్పుడు టాక్సీవాలా సక్సెస్ తో మరోసారి సంబరాల్లో మునిగిపోయింది టాలీవుడ్.

టాక్సీవాలా సక్సెస్ అవ్వడంతో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ యూనిట్ మొత్తాన్ని పిలిచి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. కొత్తదనాన్ని ఎప్పుడూ స్వాగతించే బన్నీ, టాక్సీవాలా యూనిట్ తో పాటు ఇండస్ట్రీకి చెందిన కొంతమంది యంగ్ టాలెంట్ ను కూడా ఈ పార్టీకి ఆహ్వానించాడు.

బన్నీ ఇలా సక్సెస్ పార్టీ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం కాదు. పెళ్లిచూపులు, గీతగోవిందం, మహానటి సినిమాలు హిట్ అయినప్పుడు ఆ యూనిట్ సభ్యులతో కలిసి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇప్పుడు టాక్సీవాలా యూనిట్ కు కూడా పెద్ద పార్టీ ఇచ్చి సక్సెస్ ను వాళ్లతో కలిసి ఎంజాయ్ చేశాడు బన్నీ.