పవన్ రీ ఎంట్రీ.. త్వరలోనే ఎనౌన్స్ మెంట్ ?
Monday,November 19,2018 - 03:28 by Z_CLU
‘అజ్ఞాతవాసి’ తర్వాత పొలిటికల్ గా బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా చేస్తాడా..? అనే సందేహం అందరిలోనూ ఉంది.. అయితే సినిమాలు చేయనని పవన్ చెబుతున్న ప్రతిసారి అభిమానులు కచ్చితంగా సినిమా చేయాల్సిందే అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎట్టకేలకు పవన్ మళ్లీ సినిమా చేసేందుకు అంగీకరించినట్టు టాక్.. రామ్ తళ్ళూరి బ్యానర్ లో రాబోతున్న ఓ సినిమాలో స్పెషల్ రోల్ చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.
ఓ యువ హీరోతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న సినిమాలో పవన్ దాదాపు 40 నిమిషాల పాటు కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పటివరకూ ఈ వార్తపై ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ పవన్ ఈ సినిమా చేయడం మాత్రం పక్కా అనే టాక్ వినిపిస్తుంది. పవన్ నటించనున్న ఈ సినిమాకు సంబంధించి యువ హీరో, దర్శకుడు వివరాల్ని త్వరలోనే మేకర్స్ ఎనౌన్స్ చేస్తారట.