Allu Arjun Devisri - దేవీకి బన్నీ గిఫ్ట్ 

Thursday,July 08,2021 - 04:37 by Z_CLU

ఇండస్ట్రీ లో కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ లిస్టు చూస్తే అందులో ఖచ్చితంగా బన్నీ-దేవి లు ఉంటారు. అందులో సందేహం లేదు. ఆర్య సినిమా నుండి వీళ్ళ స్నేహ బంధం కొనసాగుతూ వస్తుంది. అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’, ‘బన్నీ’,’ఆర్య 2′,’సన్ ఆఫ్ సత్యమూర్తి’ ఇలా బెస్ట్ ఆల్బమ్స్ అందించాడు దేవి. అల్లు అర్జున్ -దేవి కాంబో అంటే అదిరిపోయే ఆల్బం పక్కా అని ఫిక్సవుతారు ఆడియన్స్.

ఆ బాండింగ్ తోనే దేవిశ్రీ ప్రసాద్ కి సర్ప్రయిజ్ గిఫ్ట్ పంపాడు బన్నీ. దేవి స్టూడియోలో పెట్టుకునేలా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అనే పేరుతో లైటింగ్ బోర్డ్ ప్రెజెంట్ చేశాడు బన్నీ. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ చెప్పుకున్నాడు దేవి. ” అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదు” అంటూ బన్నీ పంపిన గిఫ్ట్ చూస్తూ మురిసిపోయాడు దేవి. ప్రస్తుతం అల్లు అర్జున్ -సుక్కు కాంబోలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు దేవి.

ఇప్పటికే పుష్ప కోసం అదిరిపోయే సాంగ్స్ కంపోజ్ చేసిచ్చాడట DSP. పుష్ప సాంగ్స్ విని దేవి మ్యూజిక్ మరోసారి బన్నీ ఫిదా అవ్వడంతో ఈ స్వీట్ గిఫ్ట్ పంపించాడని అనుకోవచ్చు. త్వరలోనే పుష్ప నుండి మొదటి సింగిల్ రిలీజ్ కానుంది. అన్ని కుదిరితే ఈ నెలలోనో వచ్చే నెలలోనో ఆ సాంగ్ విడుదల చేసే ప్లానింగ్ లో ఉన్నారు. మరి అల్లు అర్జున్ -దేవి కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సాంగ్స్ ఏ రేంజ్ లో మెస్మరైజ్ చేసి మ్యూజిక్ లవర్స్ అలరిస్తాయో వేచి చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics