Satya Dev Thimmarusu - రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,July 08,2021 - 04:48 by Z_CLU

Satya Dev Thimmarusu Release Date

సత్యదేవ్ హీరోగా శరణ్ కొప్పిశెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘తిమ్మరుసు’ రిలీజ్ కి రెడీ అయింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 30న థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ విషయాన్ని తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి ప్రకటించారు మేకర్స్. బీర్బల్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా సినిమాలో సత్య దేవ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.

సత్య దేవ్ క్యారెక్టర్ తో పాటు సినిమాలో ఉండే కామెడీ , ట్విస్టులు అన్నీ ఆడియన్స్ ని మెప్పిస్తాయని యూనిట్ చెప్తున్నారు. ఈరోజు నుండి సినిమాకు సంబంధించి ప్రమోషన్ మొదలు పెట్టారు. ప్రస్తుతం జరుగుతున్న షూట్ పూర్తవ్వగానే గుమ్మడి కాయ కొట్టేసి షూట్ చేసిన సీన్స్ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయనున్నారు. కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత థియేటర్స్ లోకి వస్తున్న తిమ్మరుసు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

satya dev thimmarusu movie

సత్యదేవ్ సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవిబాబు, బ్రహ్మాజీ , వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బేనర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics