Pushpa Intro Song - ఫస్ట్ రిలీజయ్యేది ఇదే!

Tuesday,June 22,2021 - 05:10 by Z_CLU

అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో సినిమా ఆల్బంపై కూడా అన్నే అంచనాలే ఉన్నాయి. అవును సుకుమార్ మొదటి సినిమా నుండి పుష్ప వరకు అన్నిటికి దేవి శ్రీ ప్రసాద్ నే మ్యూజిక్ కంపోజర్. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ ఆల్బం సూపర్ హిట్టే. ఒకరకంగా చెప్పాలంటే సుకుమార్ ఎలాంటి సినిమా తీస్తున్నాడో ముందే దేవి సాంగ్స్ తో ఎలివేట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంటాడు.

devisri allu arjun sukumar

అందుకే ఇప్పుడు ఈ కాంబోలో రానున్న ‘పుష్ప’ ఆల్బంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ‘పుష్ప’ కోసం ఐదు పాటలు కంపోజ్ చేసేశాడు దేవి. సెట్స్ పైకి వెళ్ళకముందే నాలుగు పాటలు ఓకె అయిపోయాయి. అయితే తాజాగా ‘పుష్ప’ ఇంట్రో కోసం ఓ అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేసి రికార్డ్ చేసిచ్చాడట డి ఎస్ పి. ఈ సాంగ్ ని త్వరలోనే మొదటి సింగిల్ గా విడుదల చేసే ప్లానింగ్ మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది.

జులై నుండి జరగబోయే షెడ్యుల్ లో ముందుగా ఈ సాంగ్ ని షూట్ చేస్తారని సమాచారం. ఈ సాంగ్ ని డిఫరెంట్ గా కంపోజ్ చేసే ప్లాన్ తో సుక్కు అండ్ టీం రెడీ గా ఉన్నారట. త్వరలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సాంగ్ ని షూట్ చేసి ఆ తర్వాత ఇంపార్టెంట్ సీన్స్ తీయనున్నారట. ఈ షెడ్యుల్ లో బన్నీ – ఫహాద్ ఫాజిల్ లపై కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట.

allu arju pushpa movie zeecinemalu

ఇక బన్నీ -సుక్కు -దేవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల ఆల్బమ్స్ ఇప్పటికీ ఎక్కడో చోట వినబడుతూనే ఉంటాయి. ఇప్పుడు పుష్ప పాటలు కూడా ఆ స్థాయిలోనే అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయని ఇన్సైడ్ న్యూస్. మరి సుక్కు -దేవి సాంగ్స్ తో ఎలాంటి మేజిక్ చేస్తారో వేచి చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా రెండు భాగాలుగా రానుంది. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics