Allu Arjun Next Movie - నెక్స్ట్ సినిమాపై క్లారిటీ

Friday,June 11,2021 - 01:26 by Z_CLU

‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ? నిన్నటి వరకు అందరిలో ఉన్న ప్రశ్న ఇదే. దీనికి రీజన్ బన్నీ లిస్టులో చాలా మంది దర్శకులు ఉండటం. అవును స్టైలిష్ స్టార్ నెక్స్ట్ ఈ దర్శకుడితో ఆ దర్శకుడితో అంటూ కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు బన్నీ నెక్స్ట్ సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో ‘ఐకాన్’ సినిమా చేయబోతున్నాడు. ఎప్పుడో ప్రకటించిన ఈ సినిమా ఎట్టకేలకు త్వరలోనే పట్టాలెక్కబోతుంది.

allu arjun

పుష్పరాజ్ గా అల్లు అర్జున్

ఈ విషయన్ని నిర్మాత బన్నీ వాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బన్నీ వాస్ గీతా ఆర్ట్స్2 బేనర్ లో నిర్మాతగా సినిమాలు చేస్తూ బన్నీ వ్యవహారాలన్నీ చూసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఇక బన్నీ నెక్స్ట్ సినిమాపై బన్నీ వాస్ ఇచ్చిన ఈ క్లారిటీతో ఫ్యాన్స్ కి #AA21 పై క్లారిటీ వచ్చింది. ఇక అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో తెరకెక్కనున్న ‘పుష్ప రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం రిలీజ్ తర్వాత రెండో భాగానికి టైం తీసుకుంటారట మేకర్స్. ఈ లోపు బన్నీ ‘ఐకాన్’ సినిమా కంప్లీట్ చేసి ఆ తర్వాత ‘పుష్ప’ పార్ట్ 2 మొదలు పెడతాడట.

bunny vas allu arjun

అల్లు అర్జున్ తో నిర్మాత బన్నీ వాస్

ఇటివలే ‘వకీల్ సాబ్’ తో పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసి సక్సెస్ అందుకున్న శ్రీరామ్ వేణు నెక్స్ట్ అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఎప్పుడో స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు శ్రీరామ్ వేణు. అక్టోబర్ లేదా నవంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics