Allu Arjun Next movie details after Pushpa

Friday,June 11,2021 - 01:26 by Z_CLU

'పుష్ప' తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ? నిన్నటి వరకు అందరిలో ఉన్న ప్రశ్న ఇదే. దీనికి రీజన్ బన్నీ లిస్టులో చాలా మంది దర్శకులు ఉండటం. అవును స్టైలిష్ స్టార్ నెక్స్ట్ ఈ దర్శకుడితో ఆ దర్శకుడితో అంటూ కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు బన్నీ నెక్స్ట్ సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో 'ఐకాన్' సినిమా చేయబోతున్నాడు. ఎప్పుడో ప్రకటించిన ఈ సినిమా ఎట్టకేలకు త్వరలోనే పట్టాలెక్కబోతుంది.

[caption id="attachment_189338" align="alignnone" width="650"]allu arjun పుష్పరాజ్ గా అల్లు అర్జున్[/caption]

ఈ విషయన్ని నిర్మాత బన్నీ వాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బన్నీ వాస్ గీతా ఆర్ట్స్2 బేనర్ లో నిర్మాతగా సినిమాలు చేస్తూ బన్నీ వ్యవహారాలన్నీ చూసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఇక బన్నీ నెక్స్ట్ సినిమాపై బన్నీ వాస్ ఇచ్చిన ఈ క్లారిటీతో ఫ్యాన్స్ కి #AA21 పై క్లారిటీ వచ్చింది. ఇక అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో తెరకెక్కనున్న 'పుష్ప రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం రిలీజ్ తర్వాత రెండో భాగానికి టైం తీసుకుంటారట మేకర్స్. ఈ లోపు బన్నీ 'ఐకాన్' సినిమా కంప్లీట్ చేసి ఆ తర్వాత 'పుష్ప' పార్ట్ 2 మొదలు పెడతాడట.

[caption id="attachment_190819" align="alignnone" width="426"]bunny vas allu arjun అల్లు అర్జున్ తో నిర్మాత బన్నీ వాస్[/caption]

ఇటివలే 'వకీల్ సాబ్' తో పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసి సక్సెస్ అందుకున్న శ్రీరామ్ వేణు నెక్స్ట్ అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఎప్పుడో స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు శ్రీరామ్ వేణు. అక్టోబర్ లేదా నవంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics