ఖైదీ నంబర్ 150లో బన్నీ

Friday,January 06,2017 - 03:08 by Z_CLU

చిరంజీవి రీఎంట్రీ మూవీ అనగానే మెగా హీరోలంతా సంబరపడ్డారు. కుదిరితే మెగాస్టార్ సినిమాలో మెరవాలని ఆశపడ్డారు. మరీ ముఖ్యంగా చిరంజీవి నటించిన 150వ సినిమా కావడంతో కచ్చితంగా ఏదో ఒక పాత్రలో కనిపిస్తే కలకాలం గుర్తుండిపోతుందని కలలుగన్నారు. కానీ ఫైనల్ గా ఆ అవకాశం రామ్ చరణ్, అల్లు అర్జున్ కు మాత్రమే దక్కింది. తండ్రి నటించిన ఖైదీ నంబర్ 150లో ఓ చిన్న పోర్షన్ లో కనిపిస్తానని రామ్ చరణ్ ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో బన్నీ కూడాా ఉన్న విషయం తాజాగా బయటకొచ్చింది.

ram-charan-bunny-allu-arjun-vinayak-zee-cinemalu

చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150లో ఓ కీలకపాత్రలో బన్నీ కనిపించనున్నాడట. తమ్ముడు..లెట్స్ డు కుమ్ముడు అనే లిరిక్ వద్ద చెర్రీ-చిరు కలిపి స్టెప్పులేస్తారని సమాచారం. ఇక సినిమాలోని ఓ సన్నివేశంలో బన్నీ మెరుపులా వచ్చి కనువిందు చేస్తాడనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికైతే గాసిప్ లెవెల్లోనే ఉన్న ఈ న్యూస్, మరో 2 రెండు రోజుల్లో జరగనున్న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో కన్ ఫర్మ్ అయ్యే అవకాశాలున్నాయి.