తమన్నా పెళ్ళి చూపులకి రెడీ

Friday,January 06,2017 - 02:00 by Z_CLU

తెలుగులో చిన్న సినిమాగా తెరకెక్కి భారీ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ‘పెళ్ళి చూపులు’ తమిళ్ లో రీమేక్ కి రెడీ అవుతోంది. అఫ్ కోర్స్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గౌతమ్ మీనన్ ఈ సినిమా తమిళ్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. అయితే గౌతమ్ మీనన్ ఈ సినిమాని జస్ట్ ఆవరేజ్ సినిమాగా ప్లాన్ చేయడం లేదు. ఏకంగా స్టార్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకున్నాడు.

‘పెళ్ళి చూపులు’ తమిళ్ వర్షన్ లో తమన్నా నటించనుంది. రేపో మాపో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో కొత్త హీరోని పరిశీలిస్తున్న సినిమా యూనిట్, ఈ సినిమా తమిళ నాట కూడా సక్సెస్ ని బ్యాగ్ లో వేసుకోవడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది.