

Saturday,December 03,2016 - 09:11 by Z_CLU
అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’. పెద్ద నోట్ల రద్దుతో పోస్ట్ ఫోన్ అయిన మొదటి సినిమా ఇదే. ఈ సినిమా తరువాత కొన్ని బడా సినిమాలు సైతం విడుదలను పోస్ట్ ఫోన్ చేసుకొని వెనుతిరిగాయి. అయితే టాలీవుడ్ హీరోలందరికీ నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా కలెక్షన్స్ తో ధైర్యం రావడంతో వరుసగా డిసెంబర్ లో సినిమా సందడి మొదలైంది. ఇక ఈ సినిమా తరువాత వరుసగా సినిమాలు విడుదల అవుతుండడం కలెక్షన్స్ పరవాలేదనిపిస్తుండడం తో అల్లరోడు కూడా రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాను డిసెంబర్ మూడో వారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. హారర్ కామెడీ జోనర్ లో అల్లరినరేష్ చేసిన మొదటి సినిమా ఇదే.
Monday,July 04,2022 07:34 by Z_CLU
Monday,July 04,2022 11:01 by Z_CLU
Saturday,July 02,2022 02:32 by Z_CLU
Friday,July 01,2022 05:27 by Z_CLU