జీసినిమాలు (డిసెంబర్ 3rd)

Friday,December 02,2016 - 08:00 by Z_CLU

anaganaga-oka-dheerudu
హీరోహీరోయిన్లు – సిద్దార్థ్, శృతిహాసన్
నటీనటులు – లక్ష్మీ మంచు, హర్షిత, సుబ్బరాయశర్మ, రవిబాబు, బ్రహ్మానందం
సంగీతం – సలీమ్ సులేమాన్, ఎం.ఎం.కీరవాణి, కోటి, మిక్కీ జే మేయర్, అనంత్
దర్శకత్వం – ప్రకాష్ కోవెలమూడి
విడుదల తేదీ – 2011, జనవరి 14

తెలుగులో ఫాంటసీ-ఎడ్వెంచరస్ మూవీస్ కాస్త తక్కువే. బడ్జెట్ ఎక్కువ, రిస్క్ కూడా ఎక్కువే అనే ఉద్దేశంతో ఎక్కువమంది ఈ జానర్ ను టచ్ చేయరు. కానీ తొలి సినిమాతోనే అలాంటి రిస్క్ తీసుకున్నాడు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అనగనగా ఒక ధీరుడు మూవీని డిస్నీ వరల్డ్ సినిమా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సంయుక్తంగా సమర్పించారు. మంచు లక్ష్మి తొలిసారిగా లేడీ విలన్ గా నటించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ మూవీకి ఏకంగా ఐదుగురు సంగీత దర్శకులు పనిచేశారు. యోధ అనే మలయాళ సినిమా ఆధారంగా తెరకెక్కిన అనగనగా ఒక ధీరుడు సినిమాలో భారీ సెట్స్, గ్రాఫిక్స్ కనువిందు చేస్తాయి. 2011 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంది. సిద్దార్థ్ నటన, శృతిహాసన్ అందాలు కూడా తోడయ్యాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోతున్న శృతిహాసన్ కు తొలి తెలుగు చిత్రం ఇదే.

——————————————————————

pavitra-hrudayalu

నటీనటులు : నందమూరి తారక రామారావు, జమున, చంద్రకళ

ఇతర నటీనటులు : శాంత కుమారి, సంధ్యా రాణి, గుమ్మడి, నాగయ్య, రాజబాబు, సత్య నారాయణ, అల్లు రామ లింగయ్య తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చలపతి రావు

డైరెక్టర్ : A.C. త్రిలోక్ చందర్

ప్రొడ్యూసర్ : C.S.రాజు

రిలీజ్ డేట్ : 1971

నందమూరి తారక రామారావు, జమున నటించిన అద్భుత ప్రేమకథా చిత్రం పవిత్ర హృదయాలు. ఈ సినిమాకి చలపతి రావు అందించిన సంగీతం ప్రాణం.

——————————————————————

soundarya-chandramukhi

హీరోహీరోయిన్లు – విష్ణువర్థన్, సౌందర్య

నటీనటులు – రమేష్ అరవింద్, ప్రేమ,

సంగీతం – గురుకిరణ్

స్క్రీన్ ప్లే – దర్శకత్వం –  పి.వాసు

విడుదల తేదీ – 2005

కన్నడలో సూపర్ హిట్ అయిన ఆప్తమిత్ర సినిమాను సౌందర్య చంద్రముఖి పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమా కేవలం శాండిల్ వుడ్ లోనే కాదు… టోటల్ సౌత్ లోనే సూపర్ సెన్సేషనల్ హిట్ అయింది. నిజానికి 1993లో వచ్చిన మలయాళం సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కింది. మలయాళంలో మోహన్ లాల్, శోభన కీలకపాత్రలు పోషిస్తే… కన్నడలో విష్ణువర్థన్, సౌందర్య నటించారు. తర్వాత ఇదే సినిమాను తమిళ్ లో రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రలుగా తెరకెక్కించారు. తర్వాత ఇది బుల్ బులయా పేరుతో హిందీలో కూడా రీమేక్ అయింది. స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా… కథలో దమ్ముంటే సినిమా హిట్ అవుతుందని నిరూపించింది సౌందర్య చంద్రముఖి సినిమా. అన్ని భాషల్లో ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి. అప్పటివరకు ఫ్లాపుల్లో ఉన్న రజనీకాంత్ కెరీర్ ను మళ్లీ స్వింగ్ లోకి తీసుకొచ్చిన మూవీ కూడా ఇదే కావడం విశేషం. అంతేకాదు… సౌందర్య నటించిన చివరి చిత్రం కూడా ఇదే.

——————————————————————

ye-maya-chesave-posters13

నటీనటులు : నాగ చైతన్య, సమంతా రుత్ ప్రభు

ఇతర నటీనటులు : కృష్ణుడు, దేవన్, సుధీర్ బాబు, సంజయ్ స్వరూప్, సురేఖా వాణి, లక్ష్మీ రామకృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : గౌతమ్ వాసుదేవ్ మీనన్

ప్రొడ్యూసర్ : మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్

రిలీజ్ డేట్ : 26 ఫిబ్రవరి 2010

గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమా నాగ చైతన్య కరియర్ ట్రాక్ నే మార్చేసింది. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయిన సమంతా, మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టేసుకుంది. అంత ఇంపాక్ట్ ని చూపించింది ఈ సినిమా. అతి సాధారణ ప్రేమకథని అద్భుతంగా తెరకెక్కించాడు గౌతమ్ మీనన్. A.R. రెహమాన్ సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

——————————————————————

ala-ela

హీరోహీరోయిన్లు –రాహుల్ రవీంద్రన్, ఖుషి
నటీనటులు –వెన్నెల కిషోర్, షాని, భానుశ్రీ మెహ్రా తదితరరులు
సంగీతం –భీమ్స్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం –అనీష్ కృష్ణ
విడుదల తేదీ –2014, నవంబర్ 28

అందాల రాక్షసి సినిమాలో క్లాస్ గా కనిపించిన రాహుల్ రవీంద్రన్ లో మరో కోణం చూడాలంటే అలా ఎలా సినిమా చూడాల్సిందే. కంప్లీట్ ఫ్రెష్ లుక్ తో, కడుపుబ్బా నవ్వుకునే కామెడీ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అనీష్ కృష్ణ దర్శకుడు. వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.

——————————————————————

action_3d_movie_wallpapers_2bf25a0

నటీ నటులు : అల్లరి నరేష్, స్నేహా ఉల్లాల్

ఇతర నటీనటులు : వైభవ్, రాజు సుందరం, శ్యామ్, నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలాని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : బప్పి& బప్పి లహరి, సన్నీ

డైరెక్టర్ : అనిల్ సుంకర

ప్రొడ్యూసర్ : రామబ్రహ్మం సుంకర

రిలీజ్ డేట్ : 21 జూన్ 2013

అల్లరి నరేష్ నటించిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యాక్షన్ 3D’. 2D, 3D ఫార్మాట్లలో తెరకెక్కిన మొట్టమొదటి కామెడీ చిత్రం. అల్లరి నరేష్ కరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ సుంకర దర్శకుడు.