ఆ ఒక్కటే బ్యాలెన్స్

Saturday,December 03,2016 - 10:00 by Z_CLU

మెగా స్టార్  ‘ఖైదీ నంబర్ 150 ‘ తో సంక్రాంతి కి కలెక్షన్స్ సునామి సృష్టించడానికి రెడీ అవుతున్నాడు చిరంజీవి. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సాంగ్ షూటింగ్ లో ఉంది. ఈ సాంగ్ షూట్ తో సినిమాకు గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు.

ఇప్పటికే  రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అందరినీ ఎట్రాక్ట్ చేయగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన వర్కింగ్ స్టిల్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. డిసెంబర్ చివరి వారం లో నిర్వహించనున్న ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు అతిరథ మహారధుల్ని ఆహ్వానించడానికి రెడీ అవుతున్నాడు నిర్మాత రామ్ చరణ్. అదే వేడుకలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసి అక్కడి నుండి మెగా ప్రమోషన్ మొదలు పెట్టబోతున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఖైదీ నంబర్ 150 సినిమా సంక్రాంతి కానుగా థియేటర్లలోకి రానుంది.