మేడమీద అబ్బాయిగా అల్లరి నరేష్

Monday,March 27,2017 - 03:49 by Z_CLU

మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘ఒరు వడక్కం సెల్ఫీ’ రీమేక్ లో నటిస్తున్నాడు అల్లరి నరేష్. నిఖిల విమల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ కూడా ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ‘మేడ మీద అబ్బాయి’ అని టైటిల్ ఫిక్స్ అయిన ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ని బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నాడు.

నరేష్ కరియర్ లో గమ్యం, శంభో శివ శంభో లాంటి డిఫెరెంట్ సినిమాల క్యాటగిరీలో ఈ సినిమా కూడా నిలిచిపోనుందని  కాన్ఫిడెంట్ గా ఉన్న సినిమా యూనిట్, ప్రస్తుతం పోలాచ్చి లో షూటింగ్ జరుపుకుంటుంది. ఏప్రియల్ 3 వరకు జరిగే ఈ రెగ్యులర్ షెడ్యూల్ తరవాత, హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభించే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. ఈ సినిమాకి D.J. వసంత్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.