పూరి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ...

Monday,March 27,2017 - 04:25 by Z_CLU

ఓ పక్క స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరో వైపు యంగ్ హీరోలను కూడా డైరెక్ట్ చేస్తూ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్న పూరి ఇటీవలే ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన సినిమా ‘రోగ్’.. ఈ సినిమా మార్చ్ 31 న విడుదల కాబోతున్న సందర్భంగా పూరి మీడియా తో ముచ్చటించాడు.. ఆ విశేషాలు పూరి మాటల్లోనే…

 

రోగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడు..?

‘రోగ్’ నేను చాలా రోజుల తర్వాత తీసిన క్యూట్ లవ్ స్టోరీ. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. కలకత్తా లో జరిగే కథ ఇది. మెయిన్ గా ఈ సినిమాలో ఇషాన్ తన పర్ఫార్మెన్స్, ఫన్నీ డైలాగ్స్ తో బాగా ఎంటర్టైన్ చేస్తాడు. రీసెంట్ గా ట్రైలర్ కి ఆడియో కి మంచి రెస్పాన్స్ అవుతుంది. విజువల్ గా చాలా ఎట్రాక్ట్ చేస్తుంది..

 

రోగ్ రిలీజ్ కాస్త లేట్ అయింది..కారణమేంటి?

ఈ సినిమా డిసెంబర్ లోనే రిలీజ్ అవ్వాలి.. కానీ సమ్మర్ అయితే బెటర్ అని అందరం ఫీల్ అయ్యి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. తెలుగు-కన్నడ లో ఒకేసారి మార్చ్ 31న రిలీజ్ కాబోతుంది..

రీసెంట్ గా ఇషాన్ 50 సినిమాలు చేస్తాడని స్టేట్ మెంట్ ఇచ్చారు.. ఇషాన్ లో అన్ని సినిమాలు చేయగలిగే సత్తా ఉందా?

ఇషాన్ తో ఈ సినిమా సెట్స్ మీద కెళ్ళినప్పటి   నుంచి తన మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సినిమా గురించి ఎంత కష్టం అయినా పడతాడు  ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. మంచి హిట్ సినిమాలు పడితే కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనిపించింది. ఇప్పటికే సినిమా చాలా మందికి చూపించా వాళ్లందరికీ ఇషాన్ బాగా నచ్చేశాడు.. సో కచ్చితంగా తను 50 సినిమాలు చేస్తాడని అనిపించింది అందుకే అలా అన్నాను..

 

యంగ్ స్టర్స్ తో చేసే టప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది?

కొత్త వాళ్ళ పై ఎలాంటి అంచనాలు ఉండవు కనుక వాళ్ళతో కాస్త రిలాక్స్ గా సినిమా చేయొచ్చు.. ఓ రకంగా చెప్పాలంటే కొత్త వాళ్ళతో ఎగ్జైట్ మెంట్ ఉంటుంది..

 

‘టెంపర్’-‘జ్యోతిలక్ష్మి’ మీకు దర్శకుడిగా మరింత గుర్తింపు తీసుకొచ్చాయి కదా.. మళ్ళీ ఇతర వ్యక్తుల కథలతో సినిమాలు చేస్తారా?

కచ్చితంగా మంచి కథ దొరికితే నాకు బాగా నచ్చితే అది ఎవరు రాసారు అని ఆలోచించను. నా స్టయిల్ లో ఆ కథను సినిమాగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తా అంతే..

 

ఈ మధ్య ఆడియన్స్ను పెద్దగా ఎంటర్టైన్ చేయలేక పోయారు కదా.. దీని పై మీ రెస్పాన్స్ ?

నిజానికి ఏదో నమ్మి ఓకే గత్ ఫీలింగ్ తో సినిమాలు తీస్తాం. ఒక కథ అనుకుంటా అది హీరోకి ప్రొడ్యూసర్ కి నచ్చితే స్టార్ట్ అయిపోతుంది. పోకిరి అంత హిట్ అవుతుందని, ఇండస్ట్రీ రికార్డులు కొట్టేస్తుందని మేము అసలు ఊహించలేదు.ఒక్కో సారి ఆ సినిమా ఆడియన్స్ కు నచ్చకపోవచ్చు… ఆ సినిమా రిలీజ్ టైం లో అపోజిట్ సినిమాల బట్టి కూడా డివైడ్ టాక్ రావొచ్చు. ఇలా వంద కారణాలుంటాయి.. హిట్ ప్లాప్ అనేవి మన చేతిలో ఉండవు..జస్ట్ సినిమాలు చేస్తూ వెళ్తుంటా.. నచ్చితే హ్యాపీ లేదా ఇంకొకటి అంతే….

 

మెగా హీరోలలో ఎవరితోనైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా?

లేదు.. ఆల్మోస్ట్ అందరితో చేసేశా.. చిరంజీవి గారితోనే బ్యాలెన్స్ సో ఆయనతోనే చెయ్యాలి. రీసెంట్ గా చిరంజీవి గారిని కలిశాను. త్వరలోనే ఆయనతో కచ్చితంగా సినిమా చేస్తా.

 

మీ సినిమాలో బాలయ్య ఎలా కనిపిస్తారు ?

ఓ డిఫరెంట్ లుక్ లో డిఫరెంట్ క్యారెక్టర్ తో డైనమిక్ గా కనిపిస్తారు. గ్యాంగ్ స్టార్స్ నేపథ్యం లో జరిగే కథ ఇది. బాలకృష్ణ గారి ఫాన్స్ తో పాటు ఆడియన్స్ అందరు ఈ సినిమా చూసి చాలా కొత్తగా ఫీలవుతారు.. రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే ఉంటుంది.

 

 

బాలయ్య సినిమాకు సోషల్ మీడియా లో కొన్ని టైటిల్స్ వినిపిస్తున్నాయి.. ఏదైనా టైటిల్ ఫిక్స్ చేసారా?

హా నేను కూడా సోషల్ మీడియా లో చూసాను. కానీ ఆ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి టైటిల్ ఫైనల్ చేయలేదు. టైటిల్ ఫిక్స్ అవ్వగానే త్వరలోనే అనౌన్స్ చేస్తాం..

 

బాలకృష్ణ సరసన హీరోయిన్ ఫైనల్ చేశారనే వార్త వినిపిస్తుంది. నిజమేనా?

ఇంకా లేదు..పూరి కనెక్ట్స్ నుంచి ఒక కొత్త అమ్మాయి ని లాంచ్ చేయాలనీ చూస్తున్నాం. ప్రెజెంట్ ముస్కాన్ అనే అమ్మాయిని అనుకుంటున్నాం.. ఫోటో షూట్స్ జరుగుతున్నాయి. త్వరలోనే హీరోనే ఎవరనేది అనౌన్స్ చేస్తాం..

 

బాలయ్య సినిమాలో సన్నీ లియోన్ ఐటెం సాంగ్ చేస్తుందని టాక్..నిజమేనా ?

ఒక స్విచువేషన్ లో ఐటెం సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కి సన్నీ లియోన్ అయితే బాగుంటుందని అనుకున్నాం. త్వరలోనే ఆ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం..

 

నెక్స్ట్ వెంకటేష్ గారి తో సినిమా చేయబోతున్నారట.. నిజమేనా?

ఇంకా ఫిక్స్ అవ్వలేదు. కానీ వెంకటేష్ గారితో ఓ సినిమా ఉంటుంది. అది ఎప్పుడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం నా ఫోకస్ అంతా బాలకృష్ణ గారితో చేసే సినిమా మీదే ఉంది. బాలయ్య గారి సినిమా తర్వాతే నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తా…