మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిన కాటమరాయుడు

Monday,March 27,2017 - 02:11 by Z_CLU

పవర్ స్టార్ కాటమరాయుడు జస్ట్ లోకల్ మార్కెట్ లోనే కాదు, ఓవర్ సీస్ లోను సత్తా చూపిస్తుంది. ఈ శనివారం కల్లా 131 లొకేషన్స్ లో $ 924, 887 వసూలు చేసిన కాటమరాయుడు, ఆదివారం నాడు $ 79, 976 వసూలు చేసి మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిపోయింది. ఇది పవన్ కళ్యాణ్ కరియర్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిన 4 వ సినిమా.

హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజైన కాటమరాయుడు రిలీజ్ కి ముందు క్రియేట్ అయిన హైప్ ఒక ఎత్తైతే, రిలీజైన తరవాత సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ మరో ఎత్తు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కాటమరాయుడు రిలీజైన ప్రతి సెంటర్ లోను వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. కాటమరాయుడు సినిమా ఎక్స్ పెక్టేషన్స్ కి మించి సక్సెస్ టాక్ బ్యాగ్ లో వేసుకోవడంతో, గబ్బర్ సింగ్ సెంటిమెంట్ అర్కవుట్ అయిందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. మరో వైపు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ గా నిలిచింది.