విజయ్ దేవరకొండ కోలీవుడ్ ఎంట్రీ

Saturday,December 23,2017 - 12:42 by Z_CLU

అర్జున్ రెడ్డి సక్సెస్ తరవాత సౌత్ ఇండియన్ సెన్సేషన్ అనిపించుకున్న విజయ్ దేవరకొండ అదే స్పీడ్ తో కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా తమిళ విక్రమ్ హీరోగా ఇరుమురుగన్ సినిమాకు దర్శకత్వం వహించిన ఆనంద్ శంకర్ విజయ్ దేవరకొండను తమిళనాట ఇంట్రడ్యూస్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు.

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ కి ఇంప్రెస్ అయిన ఆనంద్ శంకర్, విజయ్ కి ఈ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించే హీరోయిన్ తో పాటు తక్కిన టెక్నీషియన్స్ ని ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్న సినిమా యూనిట్, వీలైనంత త్వరలో సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉంది.