అల్లు అర్జున్ గెస్ట్ గా ‘ఒక్కక్షణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Saturday,December 23,2017 - 01:34 by Z_CLU

అల్లు శిరీష్ ‘ఒక్కక్షణం’ ట్రైలర్ రిలీజయింది. లవ్ & సైంటిఫిక్ థ్రిల్లర్ లా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఫ్యాన్స్ లో ఇంటరెస్ట్ ని జేనేరేట్ చేసిన సినిమా యూనిట్, నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ తో మరింత ఇంప్రెస్ చేసింది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్ విషయంలో మరింత స్పీడ్ పెంచిన సినిమా యూనిట్, క్రిస్మస్ రోజున ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తుంది. అయితే ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రావడం ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతుంది. ఈ ఈవెంట్ లో ‘ఒక్కక్షణం’ టీమ్ రివీల్ చేయబోయే ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు, అల్లు అర్జున్ స్పీచ్ హైలెట్ కానుంది.

 

మనిషిని పోలిన మనిషి కాన్సెప్ట్ తో టాలీవుడ్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఒకరి లైఫ్ లాగే మరొకరి లైఫ్ ఉంటే ఎలా ఉంటుందనే ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు V.I. ఆనంద్. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నాడు.