మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టార్ అనిపించుకున్న రానా

Saturday,December 23,2017 - 11:02 by Z_CLU

2017 రానాకి మోస్ట్ లక్కీయెస్ట్ ఇయర్ అనే చెప్పాలి. ఈ సంవత్సరం రిలీజైన 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ సినిమాలు అనిపించుకున్నాయి. ఘాజి, బాహుబలి 2 , నీన్ రాజు నేనే మంత్రి సినిమాలు వేటికవే స్పెషల్ అనిపించుకోవడమే కాకుండా ప్రెస్టీజియస్ ఫోర్బ్స్ మ్యాగజైన్ లో టాప్ 100 స్టార్స్ లో చేరిపోయాడు.

 IMDB బెస్ట్ మూవీస్ సర్వేలో రానా నటించిన ‘ఘాజి’ సినిమాతో ‘బాహుబలి 2 స్పెషల్ ప్లేసెస్ ని ఆక్యుపై చేసుకున్నాయి. చేసే ప్రతి సినిమాలను ఏదో ఒక స్పెషాలిటీ ఖచ్చితంగా ఉండాలని రూల్ పెట్టుకునే రానా ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ట్వీట్ కూడా చేశాడు.

సినిమాలే కాకుండా, T.V.  షోలతో, లైవ్ షో లతో బిజీ బిజీగా గడిపిన రానా, 2017 ఇంత సక్సెస్ ని ఇచ్చినందుకు హ్యాప్పీగా ఉందని చెప్తూనే 2018 ని కూడా అంతే ఎగ్జైటెడ్ గా వెల్కమ్ చెప్తున్నాడు.