కుర్ర హీరో సరసన సీనియర్ కాజల్

Thursday,March 22,2018 - 02:45 by Z_CLU

‘కాజల్ ఇప్పుడు సీనియర్ అయిపోయింది.’ 
‘ఆమెతో సినిమా చేయాలంటే కుర్రహీరోలకు కష్టమే.’ 
‘చిరంజీవితో సినిమా చేసిన కాజల్ కుర్రాళ్లతో నటిస్తుందా?’
ఇలాంటి భ్రమలేమైనా ఉంటే వెంటనే వాటిని మైండ్ నుంచి డిలీట్ చేసేయండి. కథ బాగుంటే హీరో ఎవరైనా ఓకే అనే కాన్సెప్ట్ ను చేతలతో చూపిస్తోంది ఈ బుట్టబొమ్మ. చిరు, పవన్ లాంటి సీనియర్ హీరోలే కాదు, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ లాంటి యంగ్ స్టర్స్ సరసన కూడా నటిస్తానంటోంది.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ కాంబినేషన్ లో మూవీ అనగానే అదో పెద్ద రూమర్ గా అంతా కొట్టిపడేశారు. కానీ అదే నిజమైంది. కాంబినేషన్ సెట్ అయింది. బెల్లంకొండ సరసన నటిస్తున్నట్టు ప్రకటించింది కాజల్. ఎమ్మెల్యే మూవీ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ, ఈ విషయాన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేసింది.

కథ బాగుంటే హీరో ఎవరైనా ఓకే అంటోంది. అందుకే “అ!” సినిమాలో కూడా నటించానని, ఇప్పుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలో నటించబోతున్నానని అంటోంది. సో.. స్టోరీ బాగుంటే ఇకపై కుర్రహీరోలు కూడా కాజల్ ను కన్సల్ట్ చేయొచ్చన్నమాట.