రెండో సినిమా... వారిద్దరిలో ఎవరు?

Saturday,May 23,2020 - 12:30 by Z_CLU

‘నా పేరు సూర్య’ తో మెగా ఫోన్ పట్టిన దర్శకుడు వక్కంతం వంశీ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ రెండో సినిమాకి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథను సిద్దం చేసిన వంశీ తాజాగా నానితో స్టోరీ డిస్కషన్ చేశాడు. వీరిద్దరి మధ్య ఓ మంచి స్టోరీలైన్ పై చర్చ నడిచింది.

అలోస్ట్ ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అనే టాక్ వచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడు తెరపైకి మరో హీరో పేరు వచ్చింది. వక్కంతం వంశీ ఆ కథతో రవితేజ ను కూడా అప్రోచ్ అయ్యే పనిలో ఉన్నడంటూ వార్తలొస్తున్నాయి.

నాని చేతిలో ప్రస్తుతం ‘టక్ జగదీష్’ కాకుండా ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా ఉంది. ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పై పెట్టేందుకు రెడీగా ఉన్న నాని… వంశీకి రవితేజను సజెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.

మరి ఇందులో నిజమెంత అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.