సర్ ప్రైజ్.. 14న ఏం జరగబోతోంది?

Tuesday,November 12,2019 - 12:09 by Z_CLU

ఇలా ప్రమోషన్ స్టార్ట్ చేసి, అలా పీక్స్ కు తీసుకెళ్లారు. సాంగ్స్ తో హోరెత్తిస్తున్నారు. ఎప్పటికప్పుడు స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారు. షూటింగ్ అప్ డేట్స్ షేర్ చేస్తున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సర్ ప్రైజెస్ ఇస్తున్న అల వైకుంఠపురములో యూనిట్.. ఇప్పుడు మరో సర్ ప్రైజ్ కు రెడీ అవుతోంది. మరో 2 రోజుల్లో (ఈనెల 14న) సినిమాకు సంబంధించి ఓ సర్ ప్రైజ్ ఉందంటోంది యూనిట్.

ప్రస్తుతం అదేంటనేది హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది మరో పాటకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయొచ్చని చెబుతున్నారు. ఇంకొంతమంది మాత్రం ఏకంగా సినిమా టీజర్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. యూనిట్ నుంచి మాత్రం దీనిపై ఎలాంటి లీక్స్ లేవు.

మరోవైపు సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ పూర్తిచేసింది యూనిట్. పారిస్ లో సామజవరగమన సాంగ్ ను షూట్ చేసింది. రేపు యూనిట్ అంతా ఇండియాకు రిటర్న్ అవుతుంది. 17వ తేదీ నుంచి రామోజీ ఫిలింసిటీలో మరో పాట షూటింగ్ స్టార్ట్ అవుతుంది.