ప్రభుదేవా డైరెక్షన్ లో మరో భారీ సినిమా

Friday,January 24,2020 - 11:02 by Z_CLU

ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కుతుంది సల్మాన్ ఖాన్ ‘రాధే’. అయితే ఈ సినిమా తరవాత సల్మాన్ ఖాన్ తో మరో సినిమా చేయబోతున్నాడు ప్రభుదేవా. ‘ఏక్ థా టైగర్’ ఫ్రాంచైజీ చేయబోతున్నాడు.

ఇప్పటికే ఈ ఫ్రాంచైజీకి కబీర్ ఖాన్, అబ్బాస్ అలీ దర్శకులుగా పనిచేశారు. ఇప్పుడీ వరసలో ప్రభుదేవా కూడా చేరబోతున్నాడు. గతంలో సల్మాన్ ఖాన్ తో ‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ సినిమాలకు దర్శకుడిగా పనిచేశాడు ప్రభుదేవా. దీంతో ఈ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి రిపీట్ కానుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్ వీలైనంత త్వరలో సినిమాని సెట్స్ పైకి  తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు.