మహేష్ కోసం ఎదురుచూపులు

Tuesday,October 25,2016 - 11:22 by Z_CLU

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ప్రతి సీజన్ లో మహేష్ కోసం కనీసం నలుగురు దర్శకులు వెయిటింగ్ లిస్ట్ లో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వం లో నటిస్తున్న ప్రిన్స్ ఈ సినిమా తరువాత వెంటనే కొరటాల దర్శకత్వం లో సినిమా చేస్తాడు. కొరటాల తర్వాత మహేష్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లేందుకు చాలామంది రెడీగా ఉన్నారు.

మహేష్ తో ముచ్చటగా మూడో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నాడు దర్శకుడు పూరి. ఇప్పటికే మహేష్ ను కలిసి కథ చెప్పిన పూరి ‘జనగణమన’ అనే టైటిల్ ను ఎనౌన్స్ చేశాడు. పూరితో పాటు లిస్ట్ లో వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు. నిజానికి ఈ దర్శకుడి వెయిటింగ్ ఇప్పటిది కాదు. ఖలేజా టైం నుంచి పైడిపల్లి ఎదురుచూస్తూనే ఉన్నాడు. ప్రిన్స్ పుట్టినరోజు సందర్బంగా మహేష్-పైడిపల్లి కాంబో లో సినిమా ఎనౌన్స్ చేశాడు నిర్మాత పి.వి.పి.

423269-mahesh-babu

ఇక మహేష్ డైరెక్టర్స్ లిస్ట్ లో త్రివిక్రమ్ కూడా ఉన్నాడు.ఇప్పటికే మహేష్ తో రెండు సినిమాలు చేసిన మాటల మాంత్రికుడు మహేష్ తో ఇంకో మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. వీళ్లతో పాటు మెహర్ రమేష్, గౌతమ్ మీనన్ లాంటి దర్శకులు ఎప్పట్నుంచో మహేష్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మహేష్ కు మనం టైపు కథను మెహర్ రమేష్ వినిపిస్తే… జేమ్స్ బాండ్ టైపు స్టోరీని గౌతమ్ మీనన్ వినిపించాడు.