గౌతమ్ మీనన్ కన్నుపడింది

Tuesday,October 25,2016 - 12:40 by Z_CLU

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ని తెరకెక్కించడంలో ఎక్స్ పర్ట్ గౌతమ్ మీనన్. సరికొత్త స్టోరీతో తనదైన శైలిలో సినిమాల్ని తెరకెక్కించే ఈ డైరెక్టర్ తెలుగులో సూపర్ హిట్టయిన పెళ్ళి చూపులు సినిమాపై మనసు పారేసుకున్నాడు. పెళ్ళిచూపులు తమిళం రీమేక్ రైట్స్ ని దక్కించుకున్న గౌతమ్ మీనన్ ఈ సినిమాని జస్ట్ ప్రొడ్యూస్ చేస్తాడా..? లేక దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకుంటాడా..? అనేది ఇంకా తెలియలేదు.

    ఈ సినిమా హిందీ రైట్స్ ఇప్పటికే ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోగా… తాజాగా తమిళ రీమేక్ రైట్స్ ను గౌతమ్ మీనన్ దక్కించుకున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగులో ఊహించని విజయం అందుకుంది.