10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ‘హలో’ ట్రైలర్

Thursday,December 14,2017 - 01:46 by Z_CLU

డిసెంబర్ 22 న గ్రాండ్ గా రిలీజవుతుంది హలో. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా పాటలు యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంటే, మరోవైపు ఈ సినిమా ట్రైలర్ ఏకంగా 10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. విక్రమ్ కుమార్ మార్క్ ఇమోషనల్ మ్యాజికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకి సోషల్ మీడియాలో రోజురోజుకి పెరుగుతున్న క్రేజ్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనిపిస్తుంది.

హాలీవుడ్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసిన ఫైట్స్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ వీటికి తోడు అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్  ఫ్రెష్ కెమిస్ట్రీ ఇలా చెప్పుకుంటూ పోతే, ట్రైలర్ లో రివీల్ అయిన ప్రతి ఎలిమెంట్ సినిమాపై క్యూరాసిటీ రేజ్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమాని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించాడు.