సడెన్ గా బిజీ అయిపోయిన సిసింద్రీ

Thursday,December 01,2016 - 05:35 by Z_CLU

అఖిల్ బిజీ అయిపోవడం ఏంటి జోక్ కాకపోతే… ఇప్పటివరకు కొత్త సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాలేదు. కనీసం మేకోవర్ కూడా ట్రై చేయడం లేదు. మరి ఎలా బిజీ అయిపోతాడు. ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. అఖిల్ నిజంగానే బిజీ అయిపోయాడు. అయితే అది సినిమాలతో కాదు… బ్రాండ్ అంబాసిడర్ గా సిసింద్రీ ఫుల్ బిజీ.

సినిమాల్లోకి రాకముందే యాడ్స్ తో పాపులర్ అయిపోయాడు అఖిల్. ఇప్పుడు మరోసారి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఇప్పటికే ఓ యాడ్ షూట్ కోసం ముంబయి వెళ్లి వచ్చాడు. ఆ యాడ్ షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఇదింకా సెట్స్ పై ఉంటుండగానే, మరో వస్త్ర సముదాాయానికి చెందిన యాడ్ లో పాల్గొంటున్నాడు సిసింద్రీ. ఇలా వరుసగా యాాడ్ షూటింగ్స్ తో ఈ అక్కినేని వారసుడు బిజీ అయిపోయాడు. ఈ రెండు యాడ్స్ కు సంబంధించిన అప్ డేట్స్ తోపాటు.. తన కొత్త సినిమా సంగతులతో ఆన్ లైన్ లో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటానంటున్నాడు అక్కినేని సిసింద్రీ.