గుమ్మ‌డికాయ కొట్టేసిన `గౌత‌మిపుత్ర శాత‌కర్ణి`

Thursday,December 01,2016 - 06:22 by Z_CLU

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన హిస్టారిక‌ల్ 100వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`.నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్ట‌ర్ జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శక‌త్వంలో ఫ‌స్ట్‌ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు ఈ చిత్రాన్ని హై టెక్నిక‌ల్ వాల్యూస్ , భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ ప్రెస్టీజియ‌స్ చిత్రం నిన్న‌టితో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని గుమ్మ‌డియకాయ వేడుక‌ను పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలింసిటీలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రేయా, హేమామాలినిపై ద‌ర్శ‌కుడు క్రిష్ చివ‌రి సన్నివేశాన్ని చిత్రీక‌రించారు.

gauthamiputra-satakarni-new-still

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాను ఏప్రిల్ 8, 2016లో ఉగాది ప‌ర్వ‌దినాన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అనౌన్స్ చేశారు.హైద‌రాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌, మంత్రి హ‌రీష్ రావు, దాస‌రి నారాయ‌ణ‌రావు, చిరంజీవి, వెంక‌టేష్, రాఘ‌వేంద్ర‌రావు స‌హా ప‌లువురి సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో లాంచ‌నంగా సినిమాను ప్రారంభించారు. చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా మొరాకోలోని అట్లాస్ స్టూడియోలో వార్ సీక్వెన్స్‌తో మొద‌టి షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. 1000 మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు, 200 గుర్రాలతో ఈ షెడ్యూల్ జరిగింది. అలాగే చిలుకూరి బాలాజీ ఆల‌య స‌మీపంలో మే 30 నుండి భారీ యుద్ధ నౌక సెట్ వేసి రెండో షెడ్యూల్‌ పూర్తిచేశారు. జూలై 4న జార్టియాలో మౌంట్ కెజ్‌బెగ్‌లో ప్రారంభ‌మైన మరో షెడ్యూల్‌లో క్లైమాక్స్ యుద్ధ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. సంక్రాంతి కానుకగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను విడుదల చేయబోతున్నారు.