మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన అజ్ఞాతవాసి

Wednesday,January 10,2018 - 10:29 by Z_CLU

విడుదలై 24 గంటలైనా గడవకముందే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది అజ్ఞాతవాసి. అమెరికాలో ఈ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే 10లక్షల డాలర్లు ఆర్జించింది. ప్రీమియర్స్ తో అత్యథిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది అజ్ఞాతవాసి.

మొన్నటివరకు ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో బాహుబలి-2, రెండో స్థానంలో ఖైదీ నంబర్ 150, మూడో స్థానంలో బాహుబలి-1 సినిమాలుండేవి. ఇప్పుడు అజ్ఞాతవాసి మూవీ ఖైదీ నంబర్-150, బాహుబలి-1 సినిమాల్ని క్రాస్ చేసి రెండో స్థానాన్ని ఆక్రమించింది. మొదటి రోజు ఈ సినిమాకు 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

అమెరికాలో అత్యధిక స్థాయిలో 570కి పైగా థియేటర్లలో విడుదలైంది అజ్ఞాతవాసి. ప్రీమియర్స్ కు ముుందే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ సినిమాకు 10లక్షల డాలర్లు వచ్చేశాయి.