హీరోలే ప్రొడ్యూసర్స్ అయితే ఇలా...

Saturday,October 26,2019 - 11:24 by Z_CLU

ఓ సినిమా వైడ్ రేంజ్ లో రీచ్ అవ్వాలంటే కొద్దో గొప్పో స్టార్ వ్యాల్యూ కంపల్సరీ… దాన్ని బట్టే రిలీజ్ కి ముందు  సినిమాపై బజ్ క్రియేట్ అవుతుంది. అందుకే ఇప్పుడిప్పుడే నిర్మాతలనిపించుకుంటున్న స్టార్ హీరోలు, తమ ప్రెజెన్స్ తో సినిమాకి మరింత వ్యాల్యూ ఆడ్ చేస్తున్నారు.

మీకు మాత్రమే చెప్తా : ఈ సినిమా హీరో తరుణ్ భాస్కర్. నిర్మాత విజయ్ దేవరకొండ. తరుణ్ భాస్కర్ తెలుగు ఆడియన్స్ కొత్తేం కాదు కానీ హీరోగా ఇదే ఫస్ట్ మూవీ. విజయ్ దేవరకొండ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు అనగానే కొద్దో గొప్పో వైబ్స్ ఉన్నాయి…. అయితే వాటికి సెన్సేషన్ ని ఆడ్ చేశాడు విజయ్ దేవరకొండ. అదిరిపోయే ప్రమోషనల్ సాంగ్ తో సినిమాని మరింత లైమ్ లైట్ లోకి తీసుకొచ్చాడు.

అ! : చిన్న సినిమా. మరీ డాక్యుమెంటరీలా అయిపోతుందనుకున్నాడేమో నాని సినిమాలోని చేప క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పాడు. అంతే సినిమా లెవెల్ మారిపోయింది.

రానా : సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు పెద్దగా ఇన్వాల్వ్ అయి ఉండకపోవచ్చు కానీ సినిమా తన బౌండరీ లోకి వచ్చాక అన్నీ తానై ప్రమోట్ చేసుకున్నాడు రానా. c/o  కంచెరపాలెంసక్సెస్ కి ఆల్మోస్ట్ బ్యాక్ బోన్ అయ్యాడు.