Hanu-Man Movie అయోధ్యలో హనుమాన్ టీం

Wednesday,November 30,2022 - 04:02 by Z_CLU

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరక్కిస్తున్న ‘హనుమాన్’ ప్రమోషన్స్ అయోధ్య నుండి మొదలు పెట్టారు. ఇటివలే విడుదలైన హనుమాన్  టీజర్ కి ఊహించని రెస్పాన్స్ దక్కింది. దీంతో టీం అయోధ్య చేరుకొని శ్రీరాముని దర్శించుకొని భారీ ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టారు. రాముని సన్నిధిలో టీం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయోధ్య దేవాలయ కమిటీ దర్శకుడు ప్రశాంత్ వర్మ ను , తేజ సజ్జ ను సన్మానించారు.

ఓ కుర్రాడికి హనుమాన్ పవర్ వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుండి రాబోతున్న ఈ విజువల్ వండర్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రైం షో ఎంటర్టైన్ మెంట్ బేనర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో తేజ సజ్జ సరసన అమ్రిత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ , వినయ్ రాయ్, గెటప్ శ్రీను మిగతా పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయనున్నారు.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics