Adivi sesh’s HIT2, Vishnu Vishal’s Matti Kusthi Releasing tomorrow

Thursday,December 01,2022 - 11:37 by Z_CLU

గతవారం అల్లరి నరేష్ నటించిన ' ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' , ప్రదీప్ రంగనాథన్ నటించి దర్శకత్వం వహించిన తమిళ్ డబ్బింగ్ 'లవ్ టుడే' ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ వారం కూడా తెలుగు సినిమాతో పాటు ఓ తమిళ్ డబ్బింగ్ సినిమా రిలీజ్ అవుతుంది.

అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ' HIT2' రేపే రిలీజవుతుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాతగా హిట్ సిరీస్ నుండి వస్తున్న ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ చేశారు. రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ రావడం సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. శేష్, నాని ఈ సినిమాపై గట్టి నమ్మకం పెట్టుకున్నారు.

ఇక విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన తమిళ్ సినిమా గట్ట కుస్తీ తెలుగులో మట్టి కుస్తీ టైటిల్ తో డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతుంది. రవితేజ సమర్పణలో RT టీం వర్క్స్ బేనర్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదలవుతుంది. కబడ్డీ గేంతో  స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై  విష్ణు విశాల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

డిఫరెంట్ జోనర్స్ నుండి వస్తున్నఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎలా అలరిస్తాయో ? చూడాలి.

   
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics