మనసుకు నచ్చిన పాత్రలే చేస్తున్నాను

Monday,June 29,2020 - 12:02 by Z_CLU

ఒకప్పటి హీరోయిన్ రాశి మళ్లీ బిజీ అయింది. ఇప్పుడిప్పుడే ఆమె తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తోంది. అయితే ఇది తనకు రీఎంట్రీ కాదంటోంది రాశి. తను సినిమాలు ఆపలేదని, కుటుంబ బాధ్యతల వల్ల తగ్గించానని చెబుతోంది.

“మంచి కథలు, మనసుకు నచ్చిన పాత్రలే చేస్తున్నాను. తెలుగులో 2 బిగ్ ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాను. త్వరలోనే ఆ ఎనౌన్స్ మెంట్స్ వస్తాయి. అవి నేను చెప్పకూడదు. వాళ్లే ప్రకటిస్తారు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలు చేస్తున్నాను. భర్త శ్రీముని దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను.”

ఇలా తన అప్ కమింగ్ లైనప్ బయటపెట్టింది రాశి. మళ్లీ సౌత్ లో సినిమాల నంబర్ పెంచుతానంటోంది.

తెలుగులో గోకులంతో సీత, ప్రేయసిరావే, మనసిచ్చి చూడు, పెళ్లిపందరి లాంటి సినిమాలతో పేరు తెచ్చుకుంది రాశి. పెళ్లయిన తర్వాత సినిమాలు తగ్గించింది. తెలుగులో ఆమె నటించిన లాస్ట్ మూవీ లంక. మూడేళ్ల కిందటొచ్చింది ఈ మూవీ.