మహేష్ కు గిఫ్ట్ పంపించిన హీరోయిన్

Monday,June 29,2020 - 01:16 by Z_CLU

హీరో మహేష్ ఊహించని గిఫ్ట్ అందుకున్నాడు. మరీ ముఖ్యంగా ఈ లాక్ డౌన్ టైమ్ లో అలాంటి బహుమతి వస్తుందని అస్సలు ఊహించలేదు అతడు. ఈ గిఫ్ట్ పంపించిన హీరోయిన్ రష్మిక.

అవును.. సూపర్ స్టార్ కు రష్మిక ఓ బహుమతి పంపించింది. కూర్గ్ లోని తన ఫామ్ హౌజ్ లో పండించిన ఆర్గానిక్ పచ్చి మామిడికాయలతో పాటు మామిడి పచ్చడి, మరికొన్ని వస్తువుల్ని ప్యాక్ చేసి సర్ ప్రైజ్ గిఫ్ట్ గా అందించింది.

రష్మిక తమకు బహుమతి ఇచ్చిందనే విషయాన్ని నమ్రత తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు. రష్మికకు థ్యాంక్స్ కూడా చెప్పారు.

మహేష్ తో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది రష్మిక. ఆమె కెరీర్ లో ఇప్పటివరకు పెద్ద సినిమా ఇదే. త్వరలోనే బన్నీ సరసన పుష్ప సినిమాలో నటించనుంది రష్మిక.