ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమవుతున్న "లంక"

Tuesday,April 04,2017 - 11:32 by Z_CLU

సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ “లంక”. శ్రీముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు మాట్లాడుతూ.. “వైవిధ్యమైన కథాంశంతో సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ఇది. టెలీపతి నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు విశేషమైన స్పందన వచ్చింది. అలాగే ఈ చిత్రంలో మరో కథానాయికగా నటిస్తున్న ఐనా సాహాపై చిత్రీకరించిన పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది” అన్నారు.

రాశి, సాయి రోనక్, ఐనా సాహ, సుప్రీత్ నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం శ్రీముని.