కోమాలోకి నటుడు నర్సింగ్ యాదవ్

Friday,April 10,2020 - 12:59 by Z_CLU

నటుడు నర్సింగ్ యాదవ్ ఉన్నట్టుండి నిన్న హఠాత్తుగా కోమాలోకి వెళ్లిపోయారు. వెంటనే ఆయన్ను హైదరాబాద్ సోమాడిగూడలో ఉన్న యశోద హాస్పిటల్ కు తరలించారు.

నిన్న ఉదయమే డయాలసిస్ చేయించుకొని ఇంటికొచ్చారు నర్సింగ్ యాదవ్. ఆ తర్వాత కొన్ని గంటలకే కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న డాక్టర్లు.. 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు.

ఇదిలా ఉండగా.. నర్సింగ్ యాదవ్ ఇంట్లో కింద పడిపోయారని, తలకు పెద్ద దెబ్బ తగలడం వల్లనే కోమాలోకి వెళ్లిపోయారని వస్తున్న వార్తల్ని ఆయన భార్య తోసిపుచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి వార్తల్ని నమ్మొద్దన్నారు.