హాట్ టాపిక్: బాబాయ్ తో అబ్బాయ్

Friday,April 10,2020 - 01:32 by Z_CLU

పవర్ స్టార్ సినిమాలో మెగా పవర్ స్టార్
ప్రస్తుతం ఈ మేటర్ హాట్ టాపిక్ గా మారింది. బాబాయ్-అబ్బాయ్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే ఒకరిపై మరొకరు తమ ప్రేమ చాటుకుంటారు. అయితే ఈ ఇద్దరూ కలిసి ఇంత వరకూ స్క్రీన్ మీద కనిపించలేదు. అందుకే ఇప్పుడీ వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.


‘వకీల్ సాబ్’ తో పాటే క్రిష్ డైరెక్షన్ లో ఓ పీరియాడిక్ డ్రామా సినిమా చేస్తున్నాడు పవన్. దీనికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో 10 నిమిషాల నిడివి ఉన్న స్పెషల్ క్యారెక్టర్ లో చరణ్ కనిపిస్తాడని అంటున్నారు.

తండ్రి మెగాస్టార్ తో ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్ కు… బాబాయ్ తో కలిసి నటించాలనే కోరిక బాగా ఉంది. మరి నిజంగానే ఈ కాంబో స్క్రీన్ పై కనిపిస్తుందా లేదా ఇది గాసిప్ వరకే పరిమితమా అనేది చూడాలి.