సిసలైన యాక్షన్ చూపిస్తున్న విశాల్

Saturday,November 02,2019 - 01:49 by Z_CLU

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ’యాక్షన్‌’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇస్మార్ట్‌ శంకర్‌, గద్దలకొండ గణేష్‌, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన శ్రీనివాస్‌ ఆడెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై ’యాక్షన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ శుక్రవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ “మా ఇస్టార్ట్‌ డిస్ట్రిబ్యూటర్‌, ఇస్మార్ట్‌ శ్రీను శ్రీకార్తికేయ సినిమాస్‌ బేనర్‌పై ‘యాక్షన్‌’ సినిమాతో ఫస్ట్‌టైమ్‌ ప్రొడ్యూసర్‌ అవుతున్నాడు. ‘యాక్షన్‌’ సినిమా ట్రైలర్‌ ఇప్పుడే చూశాను. చాలా చాలా బాగుంది. విశాల్‌ హీరో, తమన్నా హీరోయిన్‌గా చేసిన సినిమా. సుందర్‌ సి. తన డైరెక్షన్‌తో చింపేశారు. ఫోటోగ్రఫీగానీ, ఎడిటింగ్‌గానీ, ప్రొడక్షన్‌ వేల్యూస్‌గానీ, చాలా చాలా బాగున్నాయి.” అన్నారు.

అండర్‌ కవర్‌ మిషన్‌లో పనిచేసే మిలటరీ కమాండోగా విశాల్‌ కనిపిస్తారు. విశాల్‌ కెరీర్‌లోనే ఇది హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలలోనే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు..