రేర్ హీరోయిన్ కాంబినేషన్స్

Saturday,November 02,2019 - 10:02 by Z_CLU

మామూలుగా స్టార్ హీరో సినిమాల్లో ఇద్దరేసి, ముగ్గురేసి హీరోయిన్స్ ఉండటం కామన్. కానీ ఇప్పుడు ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో ఇద్దరేసి, ముగ్గురేసి హీరోయిన్స్ నటిస్తున్నారు. దాంతో సినిమా మరింత ఫోకస్ లోకి వస్తుంది.

నిశ్శబ్దం : మోస్ట్ ఇంటెన్సివ్ క్రైమ్ థ్రిల్లర్ లా తెరకెక్కుతుంది ఈ సినిమా. అనుష్క ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తుంది. సినిమాలో మ్యూట్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. అయితే ‘నిశ్శబ్దం’ లో ఉన్న మరో ఇద్దరు హీరోయిన్స్ శాలినీ పాండే, అంజలి.

అ! : టెక్నికల్ గా ఈ సినిమా కాజల్ దే. నాని నిర్మించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బ కూడా నటించారు.

మహానటి : సినిమా కీర్తి సురేష్ దే. కానీ ఇందులో సమంతా కూడా నటించింది. మహానటి అసలు కథ రివీల్ అయ్యేది ఈ క్యారెక్టర్ ద్వారానే. మరో కీ రోల్ లో శాలినీ పాండే నటించింది.