యాక్షన్ బిగిన్ అయింది

Thursday,March 16,2017 - 01:07 by Z_CLU

ఈ నెల 9 న గ్రాండ్ గా లాంచ్ అయింది బాలయ్య 101వ సినిమా. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రానున్న ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సినిమాలో బాలయ్య మార్క్ డైలాగ్స్ కి ఏ మాత్రం లోటుండదని ప్రామిస్ చేసిన పూరి… ఈరోజు నుంచి సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు.

బాలయ్య-పూరి సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ లోనే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. బాలయ్యని సరికొత్తగా ప్రెజెంట్ చేసే ప్లానింగ్ లో ఉన్న పూరి.. ఈ స్టోరీ డెవెలప్ మెంట్ కోసం కూడా బాగానే కసరత్తు చేశాడని తెలుస్తుంది.

ప్రస్తుతం ప్రారంభమైన షెడ్యూల్ 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఏప్రిల్ 7 నుంచి యూరోప్ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించే అవకాశముంది.