నెక్ట్ సినిమా పై రాజమౌళి స్టేట్ మెంట్

Thursday,March 16,2017 - 02:05 by Z_CLU

బాహుబలి-2 షూట్ అయిపోయింది. రిలీజ్ కి కూడా రెడీ అవుతుంది. కానీ రాజమౌళి మాత్రం ఇంకా తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది.. ఏ హీరోతో చేయబోతున్నాడు.. అనే విషయాన్ని మాత్రం అనౌన్స్ చేయకుండా సీక్రెట్ మైంటైన్ చేస్తున్నాడు.

బాహుబలి-ది కంక్లూజన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తన నెక్స్ట్ సినిమా పై రాజమౌళి స్పందించాడు. నెక్ట్స్ మూవీపై ఎలాంటి ఆలోచనలు పెట్టుకోలేదని ప్రకటించిన జక్కన్న… పాార్ట్-2 రిలీజ్ అయిన తర్వాత 2-3 నెలలు కంప్లీట్ గా రెస్ట్ తీసుకుంటానని తెలిపాడు. సినిమాల గురించి ఆలోచించకుండా, కేవలం రీఫ్రెష్ అవుతానని స్పష్టం చేశాడు. అయితే తన నెక్ట్స్ మూవీలో కచ్చితంగా భారీ గ్రాఫిక్స్ మాత్రం ఉండవని అంటున్నాడు రాజమౌళి. సో… రాజమౌళి నెక్ట్స్ మూవీ ఏంటో తెలియాలంటే కనీసం 2 నెలలు ఆగాల్సిందే.