నా పెళ్ళెప్పుడో నాకే తెలీదు

Thursday,March 16,2017 - 12:12 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచ్ లర్ ప్రభాస్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. ఈ రోజే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజైన బాహుబలి ట్రేలర్ ఇలా రిలీజయిందో లేదో సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తుంది. రాజమౌళి టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్, స్టార్స్ పర్ఫామెన్స్ లాంటివి పక్కన పెడితే, ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో  ఇంటరెస్టింగ్ పాయింట్ హైలెట్ అయింది.

ప్రభాస్ పెళ్ళి గురించి కనుక్కోవడానికి ట్రై చేసిన మీడియా ప్రతినిధులతో మొదట మైక్ రానా చేతిలో పెట్టి తప్పించుకుందామని చూసినా, చివరికి ప్రభాస్ కి తన పెళ్ళి విషయంలో స్పందించక తప్పలేదు. స్పందించాడు కదా అని ఏవైనా కొత్తగా చెప్పాడా అంటే అదీ లేదు.. సింపుల్ గా ‘నా పెళ్ళెప్పుడో నాకే తెలీదు’ అని క్లోజ్ చేశాడు.