అమర్ చిత్రకథతో ముందుకొచ్చిన రానా

Wednesday,April 03,2019 - 02:50 by Z_CLU

రానా దగ్గుబాటి ‘అమర్ చిత్ర కథ’తో కలిసి మన ముందుకొచ్చాడు. కామిక్ పుస్తకాల ద్వారా చిన్నారులకు భారత సంస్కృతిని చేరువ చేసిన ‘అమర్ చిత్ర కథ’ ఇప్పుడు థీమ్ పార్కులు, లెర్నింగ్ సెంటర్ల రూపంలో మన ముందుకొచ్చింది. వీటిని ఫ్యూచర్ గ్రూప్‌ తో కలిసి ప్రమోట్ చేస్తున్నాడు రానా.

భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని చాటేలా ఈ లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు దేశంలోని ఇతర ముఖ్య నగరాల్లో ఈ లెర్నింగ్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ లో రామానాయుడు స్టుడియోస్ సమీపంలో లెర్నింగ్ సెంటర్ వెలిసింది.

ACK Alive పేరిట వస్తున్న ఈ లెర్నింగ్ సెంటర్లకు సంబంధించి టీజర్ ను రానా రిలీజ్ చేశాడు. ప్రస్తుతానికి ఈ లెర్నింగ్ సెంటర్లలో 45కి పైగా కోర్సుల్ని ఆఫర్ చేస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, యానిమేషన్, మ్యాథ్స్, కళలు, నైపుణ్యం.. ఇలా ఏదో ఒక రంగానికి పరిమితం కాకుండా.. అన్ని రంగాలకు చెందిన కోర్సుల్ని, అన్ని వయసుల వాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది ACK Alive.