మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇక లేనట్టే

Wednesday,April 03,2019 - 12:13 by Z_CLU

బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు…?
మహేష్ ఎప్పుడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినా వచ్చే కామన్ క్వశ్చన్ ఇది. మంచి టైమ్ రావాలి, కథ సెట్ అవ్వాలంటూ మహేష్ కూడా అలానే కామన్ ఆన్సర్ ఇచ్చేవాడు. కానీ ఈసారి మహేష్ నుంచి డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది. ఎంతలా అంటే ఆల్ మోస్ట్ బాలీవుడ్ డెబ్యూ ఇక ఉండదనే రేంజ్ లో మాట్లాడాడు సూపర్ స్టార్.

బాలీవుడ్ ఎంట్రీ జరుగుతుందని అనుకోవడం లేదు. ఎందుకంటే సౌత్ సినిమాలే ఇప్పుడు చాలా భారీగా వస్తున్నాయి. సౌత్ లోనే ఓ ఎమేజింగ్ స్టోరీతో ఎమేజింగ్ సినిమా తీస్తే అది ఆటోమేటిగ్గా పాన్ ఇండియా ఫిలిం అయిపోతుంది. రాజమౌళి ఈ విషయాన్ని నిరూపించాడు కదా.”

ఇలా తన బాలీవుడ్ ఎంట్రీపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు మహేష్. తన ఫోకస్ మొత్తం సౌత్ సినిమాలపైనే ఉంటుందని, ఇక్కడే మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తానని ప్రకటించాడు మహేష్. సో.. మహేష్ నుంచి స్ట్రయిట్ హిందీ మూవీ ఇక ఉండకపోవచ్చు.