వీకెండ్ రిలీజ్

Wednesday,April 03,2019 - 03:20 by Z_CLU

ఈ వీకెండ్ కేవలం 3 సినిమాలు మాత్రమే థియేటర్లలోకి వస్తున్నాయి. వాటిలో 2 స్ట్రయిట్ మూవీస్ కాగా, ఇంకోటి డబ్బింగ్ సినిమా. ఆల్రెడీ థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఏది ఆక్యుపై చేస్తుందో చూడాలి

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న సినిమా మజిలీ. సమ్మర్ బరిలో నిలిచిన మొదటి పెద్ద సినిమా ఇదే. రియల్ లైఫ్ కపుల్ నాగచైతన్య-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ హై-ఎమోషనల్ మూవీకి శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే ట్రయిలర్ పెద్ద హిట్ అవ్వడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

ఉగాది కానుకగా శనివారం రోజున ప్రేమకథాచిత్రమ్-2 థియేటర్లలోకి వస్తోంది. సుమంత్ అశ్విన్, నందిత శ్వేత, సిద్ధి ఇద్నానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు హరికిషన్ దర్శకుడు.

వీటితో పాటు ఓ డబ్బింగ్ సినిమా రెడీ అయింది. దీని పేరు సంజనారెడ్డి. తమిళంలో రాయ్ లక్ష్మి నటించిన ఒంబదులే గురు చిత్రానికి ఇది రీమేక్. పి.టి. సెల్వకుమార్ దర్శకుడు. వాణీ వెంకటరమణ సినిమాస్ పతాకంపై నిర్మాత రవీంద్ర కల్యాణ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.