90ml మూవీ అప్ డేట్స్

Friday,October 18,2019 - 04:25 by Z_CLU

‘ఆర్ఎక్స్ 100′ ఫేం కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న ’90ఎంఎల్’ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఇటీవలే జరిగిన 4 షెడ్యుల్స్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ కూడా షూట్ చేశారు.

రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి జానీ మాస్టర్ ఆధ్వర్యంలో హీరో, 50 మంది డాన్సర్లతో 150 మంది జూనియర్ ఆర్టిస్టులతో కోకాపేటలో పెద్ద సెట్ వేసి 4 రోజుల పాటు సాంగ్ షూట్ చేశారు. త్వరలోనే రెండు పాటల చిత్రీకరణ కోసం అజర్ బేజాన్ రాజధాని బాకు వెళ్తున్నారు.

యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కార్తికేయ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజర్.

నటీనటులు – కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రావు రమేష్, రోల్ రైడ, అలీ, పోసాని కృష్ణ మురళి తదితరులు సంగీతం: అనూప్ రూబెన్స్
పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌
కెమెరా: జె.యువ‌రాజ్‌
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌
ఫైట్స్: వెంక‌ట్‌
నృత్యాలు: ప్రేమ్ ర‌క్షిత్‌, జానీ
నిర్మాత‌: అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ‌
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ రెడ్డి ఎర్ర‌